US Military: ఇజ్రాయెల్ గూటికి అమెరికా మిలిటరీ.. ఇరాన్ దెబ్బకు వ్యూహాత్మక మార్పులు!
పశ్చిమాసియా (Middle East)లో నిరంతరం దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) ఉన్న అమెరికా అత్యంత కీలక మిలిటరీ (US Military) స్థావరాలపై ఇరాన్ (Iran) ఏకధాటిగా దాడులు చేస్తుండటంతో.. ఆ బేస్లన్నింటినీ సురక్షిత ప్రాంతమైన ఇజ్రాయెల్ (Israel) భూభాగంలోకి తరలించే భారీ ప్రణాళికకు తెరలేచినట్లు సమాచారం. ప్రస్తుత యుద్ధం ముగిసిన వెంటనే ఈ బదిలీ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఇజ్రాయెలీ మీడియా సంస్థ ‘ఛానెల్ 12’ (Channel 12) ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.
ఇరాన్ దాడులతో వణుకుతున్న గల్ఫ్ బేస్‌లు
ఇటీవల సౌదీ అరేబియాలోని ‘ప్రిన్స్ సుల్తాన్’ (Prince Sultan Air Base) వైమానిక స్థావరంపై (US Military) శుక్రవారం ఇరాన్ జరిపిన భీకర దాడి అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ దాడిలో అగ్రరాజ్యానికి కళ్లు, చెవుల్లా పనిచేసే అత్యంత ఖరీదైన, అత్యాధునిక నిఘా విమానం ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ పూర్తిగా ధ్వంసమైంది. వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రు విమానాలు, క్షిపణుల కదలికలను పసిగట్టే ఈ రాడార్ వ్యవస్థను కోల్పోవడం పెంటగాన్‌కు (Pentagon) మింగుడుపడటం లేదు. అంతకుముందు ఖతార్‌లో ఉన్న అత్యంత శక్తివంతమైన అమెరికా రాడార్ కేంద్రాన్ని కూడా ఇరాన్ డ్రోన్లు నేలమట్టం చేశాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇజ్రాయెల్‌లోకి మారనున్న కీలక స్థావరాలు
భవిష్యత్తులో గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల నుంచి తమ బేస్‌లను రక్షించలేవన్న ఉద్దేశంతోనే అమెరికా (US Military) ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పు ఇజ్రాయెల్‌కు భారీ లాభం చేకూర్చనుంది. ఖతార్‌లోని ‘అల్ ఉదైద్’ బేస్ (Al Udeid Air Base), బహ్రెయిన్‌లోని అత్యంత కీలకమైన ‘ఫిఫ్త్ ఫ్లీట్’ (5th Fleet) నావికాదళ ప్రధాన కార్యాలయం, యూఏఈ (UAE)లోని ‘అల్ దఫ్రా’ బేస్‌లు ఇకపై ఇజ్రాయెల్ భూభాగంలోకి తరలివెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇజ్రాయెల్‌కు ఏంటి లాభం?
అమెరికా దళాలు పూర్తిగా ఇక్కడికి వస్తే, భౌగోళికంగా ఇజ్రాయెల్ అజేయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ స్థావరాలు అమెరికాకు ఒక బలమైన లాజిస్టిక్స్ హబ్‌గా (Logistics Hub), భారీ వార్ రిజర్వ్ స్టాక్ కేంద్రాలుగా, ఆయుధ డిపోలుగా (Weapon Depots) ఉపయోగపడతాయి. అదే సమయంలో, ఈ మార్పుల వల్ల ఇజ్రాయెల్‌కు అమెరికా (US Military) అత్యంత శక్తివంతమైన ‘థాడ్’ (THAAD), ‘పేట్రియాట్’ (Patriot), అత్యాధునిక ‘లేజర్ ఇంటర్సెప్టర్ల’ (Laser Interceptors) వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను, అత్యున్నత ఇంటెలిజెన్స్ డేటాను నేరుగా పంచుకునే అద్భుత అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి








