Israel: సైరన్ మోగితే 90 సెకన్లే సమయం.. బంకర్లలోనే బతుకు.. ఇజ్రాయెలీల జీవితం!
పశ్చిమాసియాలో ముసిరిన యుద్ధ మేఘాలు ఇజ్రాయెల్ (Israel) పౌరుల నిత్య జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశాయి. ఇరాన్ (Iran) ప్రయోగిస్తున్న క్షిపణుల భయంతో నెల రోజులకు పైగా లక్షలాది మంది ప్రజలు భూగర్భ బంకర్లలోనే (Bunkers) బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. బయట అడుగుపెట్టాలన్నా, ఏ క్షణంలో మిస్సైల్స్ విరుచుకుపడతాయోనన్న భయం వారిని మానసికంగా కృంగదీస్తోంది. ఏ ఆఫీసుకు వెళ్లినా, ఆఖరికి పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నా కాంక్రీట్ షెల్టర్లే వారికి దిక్కుగా మారాయి.
ఇవి కూడా చదవండి
ప్రతి ఇంట్లోనూ ‘మమద్’..
ఇజ్రాయెలీల (Israel) భాషలో ఇళ్లలో ఉండే బంకర్‌ను ‘మమద్’ (Mamad) అని పిలుస్తారు. నిబంధనల ప్రకారం 1992 తర్వాత దేశంలో నిర్మించిన ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ‘మమద్’ అనే కాంక్రీట్ గది ఉండాల్సిందే. సాధారణ రోజుల్లో దీన్ని పడకగదిగా వాడుకున్నా, యుద్ధ సమయంలో కిటికీలు, తలుపులు ఉక్కుతో (Steel) ఉండే ఈ గది బాంబు షెల్టర్‌గా మారుతుంది. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే.. క్షిపణి వస్తున్నట్లు వార్నింగ్ సైరన్ (Siren) మోగిన తర్వాత, ప్రజలు సురక్షిత ప్రాంతమైన బంకర్‌కు చేరుకోవడానికి వారి చేతిలో ఉండే సమయం కేవలం 15 నుంచి 90 సెకన్లు మాత్రమే! స్నానం చేస్తున్నా, గాఢ నిద్రలో ఉన్నా.. సైరన్ మోగగానే ప్రాణాలు కాపాడుకునేందుకు ఏ స్థితిలో ఉన్నా సెకన్ల వ్యవధిలో షెల్టర్‌లోకి పరుగులు తీయాల్సిందే. రోడ్డుపై వెళ్లేవారి కోసం ప్రభుత్వం (Israel) ఎక్కడికక్కడ సామూహిక బంకర్లను, మెట్రో స్టేషన్లను షెల్టర్లుగా అందుబాటులో ఉంచింది.
బంకర్లలో ‘అత్యవసర కిట్లు’..
ప్రతి ఇంట్లోని బంకర్లో ప్రజలు తప్పనిసరిగా కనీసం 3 రోజులకు సరిపడా అత్యవసర కిట్ (Emergency Kit) ఉంచుకుంటారు. ఇందులో నిల్వ ఉండే ఆహారం, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, మందులు, పవర్ బ్యాంకులు, టార్చ్ లైట్లతో పాటు, పిల్లల కోసం ఆటబొమ్మలు ఉంటాయి.
ఇక టెక్నాలజీ విషయానికొస్తే.. ప్రతి పౌరుడి స్మార్ట్‌ఫోన్‌లో ‘రెడ్ అలర్ట్’ (Red Alert App) అనే యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది (Israel) క్షిపణి రాకను ముందే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. బంకర్లలోని వైఫై (Wi-Fi) ద్వారా బయటి ప్రపంచంతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డేటింగ్ నుంచి బంకర్ వెడ్డింగ్స్ వరకు..
నిరంతర సైరన్ల మోత, యుద్ధ భయంతో యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. దీన్ని జయించడానికి వారు (Israel) బంకర్లనే వేదికలుగా మార్చుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఓ జంట భారీ షాపింగ్ మాల్లోని అండర్‌గ్రౌండ్ పార్కింగ్ బంకర్లో వివాహం (Bunker Wedding) చేసుకుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వచ్చిన అపరిచితులే ఈ పెళ్లికి అతిథులు! యువత ఒత్తిడిని తగ్గించేందుకు బంకర్ల కోసం ప్రత్యేకంగా ఓ డేటింగ్ యాప్ (Dating App) కూడా అందుబాటులోకి వచ్చింది. బంకర్ ప్రవేశ ద్వారం దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, లోపల ఉన్న సింగిల్స్ ఎవరో ఇది చూపిస్తుంది. మొత్తంగా, చావు భయంతో కాంక్రీట్ గోడల మధ్య బందీలుగా మారిన ఇజ్రాయెలీల (Israel) జీవితం.. భయానక యుద్ధ వాతావరణానికి, వారి అంతులేని పోరాట స్ఫూర్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి








