US India Trade Deal: భారత్-అమెరికా మెగా డీల్.. ఖనిజాల ఒప్పందానికి ముహూర్తం ఖరారు!
Trade Deal: భారత్ , అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇరుదేశాల మధ్య త్వరలోనే ‘క్రిటికల్ మినరల్స్’ ఒప్పందం (Critical Minerals Deal) కుదరనున్నట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2026’లో పాల్గొన్న ఆయన, ఈ ఒప్పందం ఆర్థిక వృద్ధికి , జాతీయ భద్రతకు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
వ్యూహాత్మక భాగస్వామ్యం:
అధునాతన తయారీ రంగాలు, ఇంధన వ్యవస్థలు , అత్యాధునిక సాంకేతికత అభివృద్ధిలో ఈ ఖనిజాల పాత్ర కీలకమని గోర్ వివరించారు. ఈ ఖనిజాల విశ్వసనీయ సరఫరా గొలుసును (Supply Chain) నిర్మించడం ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏప్రిల్లో భారీ ట్రేడ్ డీల్:
భారత్-అమెరికాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం గురించి కూడా రాయబారి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత స్నేహం వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని ఆయన తెలిపారు. ఏప్రిల్ నెలలో ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని, దీని ద్వారా భారత తయారీ రంగానికి సుమారు 30 ట్రిలియన్ డాలర్ల మేర భారీ మార్కెట్ అవకాశాలు లభించనున్నాయని ఆయన వెల్లడించారు.









