US Trade War: ట్రంప్ కొత్త అస్త్రం.. భారత్ సహా 16 దేశాలపై గురి!
అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ‘టారిఫ్’ల (సుంకాలు) కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. గతంలో అత్యవసర అధికారాల (1977 యాక్ట్) కింద ఆయన విధించిన భారీ సుంకాలను (US Trade War) అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును బాహాటంగానే వ్యతిరేకించిన ట్రంప్.. తన వాణిజ్య పంతం నెగ్గించుకునేందుకు తాజాగా సరికొత్త చట్టాన్ని ప్రయోగించారు.
ఏమిటీ కొత్త అస్త్రం ‘సెక్షన్ 301’?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాత్కాలికంగా అన్ని దేశాలపై 10 శాతం యూనివర్సల్ టారిఫ్ విధించిన (US Trade War) ట్రంప్.. దీర్ఘకాలిక ప్రతీకార చర్యల కోసం ఇప్పుడు ఏకంగా ‘యూఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974’లోని సెక్షన్ 301 ను తెరపైకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం, భాగస్వామ్య దేశాల ఆర్థిక విధానాలు అమెరికాకు హాని కలిగించేలా ఉన్నాయా? అన్నదానిపై అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) కార్యాలయం లోతైన దర్యాప్తు చేసేందుకు వీలుంటుంది. ఒకవేళ ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే.. సంబంధిత దేశాలపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు, దిగుమతులపై నిషేధం లేదా భారీ టారిఫ్‌లు విధించే (US Trade War) పూర్తి అధికారాలు అమెరికా ప్రభుత్వానికి దక్కుతాయి.
ఇవి కూడా చదవండి
భారత్ సహా 16 దేశాలు టార్గెట్..
ఈ ‘సెక్షన్ 301’ దర్యాప్తును కేవలం ఒక్క దేశానికే పరిమితం చేయకుండా భారత్ సహా ఏకంగా 16 దేశాలపై అమెరికా ఏకకాలంలో (US Trade War) ప్రయోగించింది. ఈ జాబితాలో చైనా, యూరోపియన్ యూనియన్ (EU), జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, తైవాన్, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాలున్నాయి. ఈ దేశాలు తమ ఉత్పత్తులకు భారీ సబ్సిడీలు ఇస్తున్నాయా? తక్కువ వేతనాలతో వస్తువులు తయారు చేసి అమెరికా మార్కెట్లో చౌకగా డంప్ (Dump) చేస్తున్నాయా? తద్వారా స్థానిక అమెరికన్ వాణిజ్యానికి నష్టం చేకూరుస్తున్నాయా? అనే కోణాల్లో యూఎస్టీఆర్ ఆరా తీయనుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారత్‌పై ముప్పు.. దర్యాప్తు ప్రక్రియ..
ఈ దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ 15 వరకు యూఎస్టీఆర్ ప్రజాభిప్రాయాన్ని సేకరించి, మే 5వ తేదీ నుంచి అధికారిక విచారణ (Hearings) ప్రారంభించనుంది. ఎలాంటి ఉల్లంఘనలు లేకుంటే 12 నెలల్లో దర్యాప్తు ముగుస్తుంది. గతంలో రష్యా చమురు కొనుగోళ్ల సాకుతో భారత్‌పై అమెరికా (US Trade War) ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించి, ఆ తర్వాత 18 శాతానికి తగ్గించింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ ముప్పు తాత్కాలికంగా తప్పినప్పటికీ, భారత్-అమెరికా మధ్య ఇంకా స్పష్టమైన వాణిజ్య ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు పేరుతో ఏవైనా లోపాలు ఎత్తిచూపి, ట్రంప్ మరోసారి భారత్‌పై ప్రతీకార టారిఫ్‌లు విధించే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు, ట్రంప్ చట్ట ప్రయోగంపై (US Trade War) యూరోపియన్ యూనియన్ (EU) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇప్పటికే చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను తుంగలో తొక్కడమేనని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి








