Iran War: పాకిస్థాన్ ఓవరాక్షన్‌కు టెహ్రాన్ బ్రేక్.. మాకెలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ!
పశ్చిమాసియాలో (Middle East) అణుక్షణం అగ్నిపర్వతంలా రగులుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చే నెపంతో, అంతర్జాతీయ వేదికపై దౌత్యపరమైన మైలేజీ (Diplomatic Mileage) సాధించాలని ఉవ్విళ్లూరిన పాకిస్థాన్‌కు (Pakistan) ఇరాన్ గట్టి షాకిచ్చింది. అమెరికా, ఇరాన్ (Iran War) మధ్య ముఖాముఖి చర్చలకు (Direct Talks) తాము విజయవంతంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటనలను టెహ్రాన్ తోసిపుచ్చింది. ఆ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.
ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ క్లారిటీ
పాకిస్థాన్ చేసుకుంటున్న ప్రచారానికి బ్రేకులు వేస్తూ, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారిక ‘ఎక్స్’ (X) ఖాతా వేదికగా ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. “అమెరికాతో మేము ఎలాంటి ప్రత్యక్ష చర్చలు (Iran War) జరపడం లేదు. బయట వినిపిస్తున్నవన్నీ కేవలం కొందరు మధ్యవర్తుల ద్వారా సృష్టించబడిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. దౌత్యపరమైన అంశాల్లో అమెరికా తరచూ మాట మారుస్తోంది. కానీ, మా వైఖరి మాత్రం ఎప్పుడూ ఒకేలా స్పష్టంగా ఉంది.
ఇవి కూడా చదవండి
అమెరికా-ఇరాన్ (Iran War) మధ్యవర్తిత్వం అంటూ పాకిస్థాన్ రూపొందించుకున్న ప్రణాళికలు వారి సొంతం.. వాటిలో మా ప్రమేయం ఏమాత్రం లేదు” అని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. యుద్ధం (Iran War) ముగింపు కోసం అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదే అయినప్పటికీ, అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరో, కవ్వింపు చర్యలకు పాల్పడింది ఎవరో ప్రపంచం గుర్తుంచుకోవాలని ఇరాన్ పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి చురకలంటించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అసలు పాకిస్థాన్ ఏం చెప్పిందంటే..
ఇటీవల ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) నేతృత్వంలో.. సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ దేశాల మంత్రులతో ఒక కీలక సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణల (Iran War) వల్ల తమ దేశాలపై పడుతున్న ఆర్థిక, వాణిజ్య ప్రభావాల గురించి వారు ప్రధానంగా చర్చించారు. ఆ సమావేశం అనంతరం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరగబోయే ‘ప్రత్యక్ష చర్చలకు’ ఈ దేశాల మంత్రులు పూర్తి మద్దతు తెలిపారని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ మధ్యవర్తిత్వం విషయమై తాము ఇప్పటికే అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారులతో ప్రాథమికంగా మాట్లాడామని ఆయన సగర్వంగా చెప్పుకొచ్చారు. కానీ తీరా ఇప్పుడు ఇరాన్.. “మా ప్రమేయమే లేదు, పాక్ సొంత ప్రణాళికలు” అని తేల్చిచెప్పడంతో పాకిస్థాన్ దౌత్య వర్గాలు తీవ్ర ఇరుకునపడ్డాయి.
ఇవి కూడా చదవండి








