Iran-US War: యుద్ధం గెలవకపోయినా.. వ్యూహాత్మకంగా నెగ్గుతున్న ఇరాన్!
పశ్చిమాసియాలో (Iran-US War) అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ‘అసమాన యుద్ధానికి‘ (Asymmetric Warfare) ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. సైనికంగా, ఆయుధాల పరంగా అమెరికా దళాలు ఎంతో బలమైనవి. అయితే ఇలాంటి యుద్ధాల్లో ఒక నియమం ఉంది: “బలహీనమైన పక్షం కేవలం ఉనికిని కాపాడుకుంటే (Surviving) చాలు.. అది విజయమే. కానీ బలమైన దేశం సంపూర్ణ విజయం సాధించకపోతే అది ఓటమితో సమానం.” ఇరాన్ ఇప్పుడు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఇరాన్‌దే పైచేయి!
యుద్ధం (Iran-US War) మొదలైన ఈ కొద్ది వారాల్లోనే ఇరాన్ తన అగ్ర నాయకత్వాన్ని, అణు మౌలిక సదుపాయాలను, క్షిపణి వ్యవస్థలను కోల్పోయింది. అమెరికా దృష్టిలో ఇరాన్ యుద్ధ యంత్రాంగాన్ని శాశ్వతంగా ధ్వంసం చేయడమే విజయం. కానీ ఇరాన్ దృష్టిలో, అమెరికా రాజకీయ సంకల్పం కుప్పకూలే వరకు ‘ప్రాణాలతో నిలబడితే’ చాలు, అదే విజయం. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా అక్కడి పాలకులకు ఎన్నికల భయం లేదు.
కానీ అమెరికాలో పరిస్థితి వేరు. 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం, గ్యాలన్ ఇంధనం ధర $4కు చేరడం, వడ్డీ రేట్లు పెరగడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడే యుద్ధాన్ని ముగించే సంకేతాలు ఇస్తున్నారు. ఇరాక్, అఫ్గానిస్థాన్, వియత్నాం యుద్ధాల చరిత్ర చూసినా.. అంతిమంగా ప్రజాస్వామ్య దేశాల కంటే నియంతృత్వ ప్రభుత్వాలే సుదీర్ఘ యుద్ధాలను (Iran-US War) సులభంగా తట్టుకోగలవని స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
గ్లోబల్ మార్కెట్లకు ఉరితాడు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడానికి ఇరాన్‌కు అణ్వాయుధాలు అవసరం లేదు.. ఒక్క ‘హార్ముజ్ జలసంధి’పై (Strait of Hormuz) గురిపెడితే చాలు. ప్రపంచ రోజువారీ చమురు సరఫరాలో 20 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఏ ఒక్క వాణిజ్య నౌకపై దాడి జరిగినా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $120 దాటింది. తన చమురు అవసరాలకు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్‌పై ఇది పెను ప్రభావం చూపుతోంది. భారత ఇంధన బిల్లులు పదివేల కోట్లకు చేరడంతో పాటు, రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతోంది.
ప్రవాస భారతీయులకు దెబ్బ
ఇది కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితమైన యుద్ధం (Iran-US War) కాదు.. దీని ప్రభావం నేరుగా 90 లక్షల మంది గల్ఫ్ ప్రవాస భారతీయుల (NRIs) జీవితాలపై పడుతోంది. గల్ఫ్‌లో ఉద్రిక్తతల వల్ల యూఏఈ, సౌదీ, ఖతార్, కువైట్‌లలోని భారతీయుల ఉద్యోగ, ప్రాణ భద్రత ప్రమాదంలో పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడంతో ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను పెంచుతోంది. ఫలితంగా అమెరికాలోని ఎన్నారైల ఈఎంఐలు, గృహ రుణాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వారి ఈక్విటీ, రిటైర్మెంట్ (401k) పోర్ట్‌ఫోలియోలు నష్టాల పాలవుతున్నాయి. అంతిమంగా, ఐదేళ్ల తర్వాత చూస్తే అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల తరహాలో ఇరాన్ (Iran-US War) మళ్లీ నిలదొక్కుకుంటుంది. ఇరాన్‌కు కేవలం ప్రాణాలతో నిలబడటమే విజయం కాగా.. అగ్రరాజ్యం అమెరికాకు మాత్రం అది వ్యూహాత్మక ఓటమే అవుతుంది.
ఇవి కూడా చదవండి








