Trump: కీలక పరిణామం.. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్…
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యంత కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సంభాషణ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నారు. ఇద్దరు నాయకులు మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారని, అలాగే వారు హోర్మూజ్ జల సంధిని తెరవడంపై కూడా చర్చించారు. భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ Xలో ఇలా రాశారు, “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం యొక్క ప్రాముఖ్యతతో సహా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితి గురించి వారు చర్చించారు.” అని వెల్లడించారు.
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసినందున, ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన ఈ సంభాషణ అత్యంత కీలకం. హోర్ముజ్ జలసంధి మూసివేత చమురు, గ్యాస్ ధరలపైనా, ప్రపంచ సరఫరా గొలుసుపైనా ప్రభావం చూపుతోంది. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. పౌరులపై, వాణిజ్య నౌకలపై, లేదా హోర్ముజ్ జలసంధిపై ఎలాంటి దాడిని అంగీకరించలేమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి








