Deepika: ప్రాణాలకు తెగించి 169 మంది భారతీయులను రక్షించిన 23 ఏళ్ల పైలట్ దీపిక!
పశ్చిమాసియాలో భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. అక్కడ చిక్కుకున్న మన పౌరులను స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘రెస్క్యూ మిషన్’లో ఒక యువ మహిళా పైలట్ అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. ప్రాణాలమీద ఆశ వదులుకుని, మళ్లీ తిరిగి వస్తానో లేదో తెలియని తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో.. ఏకంగా 169 మంది భారతీయులను సురక్షితంగా మాతృభూమికి చేర్చారు. ఆ సాహస వనితే 23 ఏళ్ల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ ‘దీపికా అధానా’ (Deepika).
తిరిగి వస్తానో రానో అమ్మా..
మార్చి 6న యూఏఈ (రాస్ అల్ ఖైమా ఎయిర్‌పోర్టు) నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరింది. వాస్తవానికి ఆ రోజు విధుల్లో దీపిక (Deepika) స్నేహితురాలు ఉండాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో దీపికకు ఆ బాధ్యత దక్కింది. ఆ యుద్ధ వాతావరణంలోకి వెళ్లేముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి, “పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు.. మళ్లీ నేను తిరిగి వస్తానో, రానో” అని ఉద్వేగానికి గురయ్యారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా వెన్నుతట్టి, కర్తవ్య నిర్వహణ కోసం ప్రోత్సహించి పంపించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ఆల్ ఉమెన్ క్రూ..
ఈ సాహసోపేతమైన రెస్క్యూ మిషన్‌కు వెళ్లిన విమానంలో కెప్టెన్‌తో సహా మొత్తం ‘మహిళా సిబ్బందే’ (All-Women Crew) ఉండటం విశేషం. ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 2 గంటలకు.. ఉద్రిక్తతల వల్ల పూర్తిగా నిర్మానుష్యంగా మారిన యూఏఈ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి 169 మంది భారతీయులతో మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. అయితే టేకాఫ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో కనెక్షన్ తెగిపోవడంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాల్లో ఆ ఉత్కంఠ క్షణాల తర్వాత మళ్లీ నెట్వర్క్ పునరుద్ధరణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
స్ఫూర్తిదాయక ప్రయాణం..
ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగానే ప్రయాణికులంతా దీపికకు (Deepika), సిబ్బందికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన దీపిక.. ఆర్కిటెక్ట్ అయిన తన తండ్రి, తాతయ్యల స్ఫూర్తితో చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు. 2021లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొంది, ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీలో చేరారు. అనంతరం గ్రీస్, ఇస్తాంబుల్‌లో ఎయిర్‌బస్ విమానాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తీసుకుని 2024లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌గా చేరారు. వృత్తిలో చేరిన అనతికాలంలోనే ఇలాంటి చారిత్రక రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనడం దీపిక (Deepika) వృత్తి నిబద్ధతకు, ధైర్యసాహసాలకు నిదర్శనంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి








