ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ – విచ్చేస్తున్న ప్రముఖులు
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మార్చి 29, 2026 (ఆదివారం) నాడు వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించనున్నారు. ‘గివ్ టు గెయిన్’ (#GiveToGain) అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్టెర్లింగ్ (VA) లోని డల్లెస్ స్పోర్ట్స్‌ప్లెక్స్ (Dulles Sportsplex) వేదికగా మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు జరగనుంది.
ముఖ్య అతిథులు:
- సుహాస్ సుబ్రమణ్యం (కాంగ్రెస్‌మెన్), మిరాండా సుబ్రమణ్యం
- కన్నన్ శ్రీనివాసన్ (వర్జీనియా స్టేట్ సెనేటర్), జయశ్రీ శ్రీనివాసన్
- జూలీ బ్రిస్క్మన్ (లౌడన్ కౌంటీ అల్గోంకియన్ డిస్ట్రిక్ట్ సూపర్ వైజర్) హాజరుకానున్నారు.
ప్రధాన ఆకర్షణలు:
ప్రముఖ సింగర్, కంపోజర్ తరుణ్ దోనిపాటి తన సంగీత ప్రదర్శనతో అలరించనున్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథుల ప్రసంగాలు, వెండర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమానికి వచ్చే వారికి ప్రవేశం ఉచితం , స్నాక్స్ కూడా ఉచితంగా (Free Snacks) అందించనున్నారు.
ఇవి కూడా చదవండి
నిర్వహణ బృందం:
ఈ కార్యక్రమ విజయవంతానికి కింది వారు కృషి చేస్తున్నారు.
- ఓవరాల్ లీడ్: సమిథ లక్ష్మి
- కల్చరల్ లీడ్: కౌసల్య
- వెండర్ స్టాల్స్: కల్పన
- కల్చరల్ అడ్వైజర్: మంజువాణి మద్దికుంట
సపోర్ట్ టీమ్: మంజుష నంపల్లి, రుద్ర భీమరెడ్డి, అనుపమ పారిపాటి, అవంతిక నక్షత్రం, శివాని బి, రాధిక ముసుకు, ప్రత్యూష ఎన్, సుధా కంచర్ల, అర్చన శేషు, విజ్జిత కాసినేని, శ్రుతి బోయినపల్లి, వినయ సూరినేని, మంజు చల్లా, స్వర్ణ కమల్, అశ్విని చిట్టిమల్ల, లక్ష్మి బుయ్యని, అనిల ఒద్దుల, నందిని, సారిక, డీజే దీప్తి.
అడ్వైజర్స్: ఉష కొండక, సుధ కొండపు, అనిత ముతోజు, శ్రీలేఖ పల్లె.
ఎగ్జిక్యూటివ్ కమిటీ:
జయంత చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), మధు బొమ్మినేని (పాస్ట్ ప్రెసిడెంట్), సాయినాథ్ బోయపల్లి (సెక్రటరీ), శ్రీకాంత్ గుడిపాటి (ట్రెజరర్), శారద సింగిరెడ్డి, విజయ్ రెడ్డి తుపాళ్ళి, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, అరవింద్ రెడ్డి ముప్పిడి.
అలాగే, జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న 19వ ఆటా (ATA) కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ కు అందరూ విచ్చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.








