లోకేష్‌కు హీరోగా తొలి సెంచరీ.. ఇక మెగాఫోన్కే ప్రాధాన్యమా?
డైరెక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj).. యాక్టర్ గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అందుకున్నారు. అరుణ్ మాథేశ్వరన్(arun Matheswaran) తెరకెక్కించిన డీసీ(DC)లో ప్రధాన పాత్రలో కనిపించిన ఆయనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో లోకేష్ చూపించిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. రిలీజైన రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో.. హీరోగా లోకేష్‌కు మంచి ఆరంభం లభించినట్టైంది. పాత్ర కోసం ఆయన 50 రోజుల పాటు స్ట్రిక్ట్ ట్రైనింగ్ ను ఫాలో అయినట్టు సమాచారం.
అయితే డీసీ(DC) సక్సెస్‌తో లోకేష్‌ను హీరోగా కొనసాగించాలనే డిస్కషన్ మొదలైంది. అయితే ఆయన ముందున్న డైరెక్టర్ జర్నీ మరింత కీలకంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్(Allu Arjun)తో చేయనున్న ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ఖైదీ2(khaidhi2), విక్రమ్2(vikram2), రోలెక్స్(Rolex) వంటి ప్రాజెక్టులు కూడా డిస్కషన్స్ లో ఉన్నాయి. ఎల్సీయూ(LCU) ఇంకా పూర్తికాలేదని లోకేష్ గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో.. డైరెక్టర్ గా ఆయనపై ఉన్న బాధ్యతలు భారీగానే ఉన్నాయి.
మరోవైపు డీసీ ఇచ్చిన ఎక్స్‌పీరియెన్స్ ఫ్యూచర్ లో ఆయన మళ్లీ నటించే అవకాశాలను మాత్రం తెరిచే ఉంచింది. యాక్టింగ్ తనకు భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని లోకేష్ చెప్పినప్పటికీ, వరుసగా సినిమాల్లో నటించాలనే ఉత్సాహం తనకు లేదనే సంకేతాలు గతంలో కనిపించాయి. దీంతో ప్రస్తుతానికి డైరెక్టర్ గానే ఆయన కొనసాగడం ఎక్కువగా కనిపిస్తోంది. హీరోగా వచ్చిన రూ.100 కోట్ల సక్సెస్ ఆయన కెరీర్‌కు అదనపు బలాన్నిచ్చింది. ఈ క్రేజ్‌ను ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం లోకేష్ ఎలా ఉపయోగించుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








