ఈ నెల 29న “సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి ‘స్కూల్ సాంగ్’ రిలీజ్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“సమ్మర్ హాలిడేస్” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘క్రష్ సాంగ్..’ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘స్కూల్ సాంగ్..’ ను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వేసవి సెలవులు కంప్లీట్ అయ్యాక తిరిగి పిల్లలు స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా ఈ పాటలో కనిపించనుంది. సింజిత్ యెర్రమల్లి ఒక బ్యూటిఫుల్ ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేశారు.








