‘ది ప్యారడైజ్’ ఆగష్టు 28న మోస్ట్ అవైటెడ్ సెకండ్ సింగిల్ ఆగస్టు 28న సరికొత్తగా లాంచ్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. తన మ్యూజిక్‌తోనే కాకుండా పాటలను సరికొత్తగా పెర్ఫామ్ చేయడంలోనూ ట్రెండ్ సెట్ చేసే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈసారి కూడా ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకొచ్చారు.
హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్‌గా రూపొందిన ఈ పాటను ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ కాన్సర్ట్ లో లాంచ్ చేయనున్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్ సెలబ్రేషన్స్ మధ్య ఈ పాటను ఆవిష్కరించనున్నారు.ఈ ప్రత్యేక లాంచ్‌లో నేచురల్ స్టార్ నాని కూడా అనిరుధ్‌తో కలిసి సందడి చేయనున్నారు. ఇప్పటికే పాట లాంచ్ కోసం నాని డల్లాస్ చేరుకున్నారు. దీంతో ఈ సింగిల్ లాంచ్ మరింత గ్రాండ్‌గా మారనుంది. కాన్సర్ట్ ప్రత్యేక ప్రదర్శన అనంతరం ఆగస్టు 29న ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా ‘ది ప్యారడైజ్’కు టాప్ టీమ్ పనిచేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా,సిహెచ్ సాయి డీవోపీ, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.








