రామాయణ ఫస్ట్ సాంగ్‌పై బిగ్ అప్డేట్.. సెప్టెంబర్‌లోనే రిలీజ్‌కు ప్లాన్!
బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామాయణ(ramayana) ముందువరుసలో నిలుస్తోంది. రణబీర్ కపూర్(Ranbir kapoor), సాయి పల్లవి(sai pallavi) జంటగా నితీష్ తివారి(nitesh tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో భారీ అంచనాలను పెంచింది. భారతీయ పురాణ కథను అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ఆవిష్కరిస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.
సినిమా విజువల్స్‌తో పాటు మ్యూజిక్ కూడా రామాయణలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. హాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్(Hans Zimmer)తో పాటు ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందిస్తుండటంతో ఆడియోపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన కచ్ఛితమైన డేట్‌పై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నమిత్ మల్హోత్రా(Namith Malhotra), యష్(Yash) నిర్మిస్తున్న ఈ భారీ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఫస్ట్ సాంగ్ తో రామాయణ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశముంది.








