Tripti Dimri: త్రిప్తి ఖాతాలో మరో క్రేజీ ఆఫర్?
బాలీవుడ్లో ఒక్క సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్న త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యానిమల్(Animal) సక్సెస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా, సుజీత్(sujeeth) దర్శకత్వంలో రూపొందనున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా బ్లడీ రోమియో(bloody romeo)లో హీరోయిన్గా ఆమె పేరును పరిశీలిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్(Niharika entertainments) బ్యానర్‌పై తెరకెక్కుతుండగా, సుజీత్ సినిమాటిక్ యూనివర్స్(SCU)లో భాగంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఇదే సమయంలో త్రిప్తి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga), ప్రభాస్(Prabhas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్(Spirit) మూవీలో కూడా నటిస్తోంది. ఒకవేళ త్రిప్తి బ్లడీ రోమియోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది ఆమెకు రెండో తెలుగు సినిమా అవుతుంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడం త్రిప్తి కెరీర్‌కు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(the paradise) అనే హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్తో బిజీగా ఉన్న నాని(nani), మరోవైపు సుజీత్ ప్రాజెక్ట్‌తో స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో త్రిప్తి భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన క్రేజ్‌ను విస్తరించుకుంటున్న త్రిప్తి డిమ్రీకి ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ కొత్త జోడీని వెండితెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి








