టాక్సిక్‌తో దిల్ రాజుకు కొత్త చిక్కులు.. నెట్టింట జరిగే ప్రచారంలో నిజమెంత?
యష్(Yash) హీరోగా తెరకెక్కిన టాక్సిక్(Toxic) పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) భారీ నమ్మకంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మొదట ఈ రైట్స్ వాల్యూ రూ.120 కోట్లుగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, చివరకు సుమారు రూ.80 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అయితే రిలీజ్ తర్వాత సినిమాకు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ తో ఈ పెట్టుబడిపై డిస్కషన్ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో దిల్ రాజుకు నష్టం తప్పదని, నష్టాన్ని భర్తీ చేసేందుకు కాకా సినిమా హక్కులు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని తెలుస్తోంది. టాక్సిక్ రైట్స్ ను దిల్ రాజు రీఫండబుల్ ప్రాతిపదికన పొందినట్లు సమాచారం. డీల్ ప్రకారం సుమారు 45 రోజుల్లో ఆయన పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో యష్‌తోనే దిల్ రాజుకు డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. టాక్సిక్ లో యష్ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో ఈ వ్యవహారం ఆయన బాధ్యతగా మారింది. KVN ప్రొడక్షన్స్(KVN Productions)తో దిల్ రాజుకు డైరెక్ట్ గా ఎలాంటి డీల్ లేదని, చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న కాకా(kaka) డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తో తనకు సంబంధం లేదని సమాచారం.
ఇప్పుడు అసలు పరీక్ష యష్ ముందే ఉంది. టాక్సిక్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో దిల్ రాజుకు చెల్లించాల్సిన మొత్తాన్ని యష్ నిర్ణీత గడువులో తిరిగి చెల్లిస్తారా? లేక ఫ్యూచర్లో దిల్ రాజు కోసం ఓ సినిమా చేయడం ద్వారా ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రెండో మార్గాన్ని ఎంచుకుంటే దిల్ రాజు పెట్టుబడి తిరిగి రావడానికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది. దీంతో టాక్సిక్ తర్వాత యష్ తీసుకోబోయే డెసిషన్ దిల్ రాజుకు అత్యంత కీలకంగా మారింది.








