Spirit: స్పిరిట్ లేట్ కు కారణాలివే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్(Spirit) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరోసారి మారింది. అసలు ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ గతేడాదే ప్రారంభం కావాల్సి ఉండగా, ఇతర కమిట్మెంట్స్ కారణంగా 2026కి వాయిదా పడింది. ఇప్పుడు తాజా పరిస్థితుల దృష్ట్యా, రాజా సాబ్ తర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ తన పూర్తి దృష్టిని ఫౌజీ సినిమాపై పెట్టాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదే సమయంలో, అతను నటిస్తున్న కల్కి(kalki) సీక్వెల్ కూడా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్(amithab bachan), కమల్ హాసన్(kamal hassan) లాంటి దిగ్గజ నటులు ఉండటంతో, వారి డేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ త్వరలోనే ఆ షూట్లో చేరనున్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కారణాల వల్ల స్పిరిట్ కొంత ఆలస్యమైనా, ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగలేదు. ఇప్పటికే ప్రభాస్ లేకుండా గోవాలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు వచ్చినప్పటికీ, మేకర్స్ మాత్రం రిలీజ్ ప్లాన్‌పై క్లారిటీగానే ఉన్నారు. ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే 2027 మార్చి 5న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం టార్గెట్ గా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి








