రుక్మిణి వసంత్‌కు స్క్రిప్ట్ సెలక్షన్ సవాల్.. ‘డ్రాగన్’పైనే ఆశలు!
సప్త సాగరదాచే ఎల్లో(Saptasagara dache ello) సినిమాతో ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్(rukmini vasanth).. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. 2023లో వచ్చిన ఈ సినిమాలో ప్రియ పాత్రలో ఆమె యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో కన్నడతో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు అందుకున్నారు. భైరతి రణగల్(bhairathi ranagal), బఘీర(bagheera), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo), ఏస్(Ace), మదరాసి(Madarasi) వంటి సినిమాల్లో కనిపించారు. అయితే ఈ సినిమాల్లో చాలా వరకు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయాయి.
ముఖ్యంగా రుక్మిణి ఇటీవల ఎంచుకుంటున్న కథలు, పాత్రలపై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పెద్దగా ప్రభావం చూపకపోగా, ఇతర భాషల్లో చేసిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. తాజాగా యష్(Yash) నటించిన టాక్సిక్(Toxic) సినిమాలోనూ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, సినిమాకు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో రుక్మిణి స్క్రిప్ట్ సెలక్షన్‌పై విమర్శలు మరింత పెరిగాయి. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(prasanth Neel) తెరకెక్కిస్తున్న డ్రాగన్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ అవకాశం రుక్మిణి కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాతో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి, మరోసారి బలమైన నటిగా నిలబడాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.








