దసరా రిలీజ్ రేసులో భారీ మార్పులు
దసరా సీజన్‌కు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, పాన్ ఇండియా సినిమాలు భారీగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్(venkatesh) నటిస్తున్న ఆదర్శ కుటుంబం(adarsha kutumbam) అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(jailer2)ను అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరోవైపు విజయ్ దేవరకొండ(vijay devarakonda) రణబాలి(Ranabaali) కూడా అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో దసరా బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ రిలీజ్ షెడ్యూల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి(chiranjeevi) విశ్వంభర(vishwambhara) అక్టోబర్ 16న రిలీజవుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిణామాలను బట్టి ఆ సినిమా దసరా బరిలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో జైలర్2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనుకున్న టైమ్‌కు పూర్తవుతాయా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్క్స్ లేటైతే సినిమాను దసరా నుంచి తప్పించి దీపావళి సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
జైలర్2 రిలీజ్‌పై ఫైనల్ డెసిషన్ రాబోయే పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుంటే, వెంకటేష్ ఆదర్శ కుటుంబంను అక్టోబర్ 15కి మార్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో అక్టోబర్ రెండో వారంలోనే పలు సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దసరా రిలీజ్ చార్ట్‌పై పూర్తి క్లారిటీ మరో రెండు వారాల్లో వచ్చే అవకాశముంది.








