యెష నాగుల పాటతో మాస్ ట్రీట్.. ది ప్యారడైజ్ పై పెరుగుతున్న అంచనాలు!
సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్ లో ఆసక్తి పెంచడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా మాస్, ఫోక్ టచ్ ఉన్న పాటలు వైరల్ అయితే సినిమాకు కావాల్సిన బజ్ మరింత వేగంగా పెరుగుతుంది. నాని(nani) హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా రిలీజైన యెష నాగుల(yesha nagula) సాంగ్ కూడా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) అందించిన సంగీతం జానపద ట్యూన్‌కు హై ఎనర్జీ ఫీల్‌ను జోడించింది.
తెలంగాణ మట్టి వాసనను ప్రతిబింబించేలా యెష నాగుల సాంగ్‌ను తీర్చిదిద్దారు. కాసర్ల శ్యామ్(kasrla shyam) రాసిన పదాలు పాటకు ప్రత్యేకమైన నేటివిటీని తీసుకొచ్చాయి. జంగి రెడ్డి(jangi reddy), ప్రభా(prabha) వాయిస్‌లోని ఎనర్జీ సాంగ్‌ను మరింత ఎనర్జిటిక్‌గా మార్చగా.. ఆట సందీప్(aata sandeep) కంపోజ్ చేసిన ఫోక్ మూవ్మెంట్స్, మాస్ కొరియోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాని వేసిన స్టెప్పులు సాంగ్ కు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. కీర్తి సురేష్(keerthy suresh) కూడా తన గ్లామర్, పెర్ఫార్మెన్స్తో సాంగ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది.
ఇప్పటికే సాంగ్స్ విషయంలో మంచి బజ్ తెచ్చుకున్న ది ప్యారడైజ్‌కు యెష నాగుల మరింత ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫోక్ ఫ్లేవర్, మాస్ బీట్, నాని డ్యాన్స్ కలిసి ఈ సాంగ్‌ను థియేటర్లలో సెలబ్రేట్ చేసే నంబర్‌గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్‌పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.








