ఆదర్శ కుటుంబంలో వరుస మార్పులు.. కారణమేంటి?
విక్టరీ వెంకటేష్(venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(adarsha kutumbam)పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ పనుల్లో కీలక దశలో ఉంది. అయితే ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో టెక్నికల్ విభాగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఒకదాని తర్వాత మరొక విభాగంలో కీలక బాధ్యతలు కొత్త వ్యక్తులకు వెళ్లడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మొదట సినిమాటోగ్రఫీ విభాగంలో మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు తొలుత సను జాన్(sanu john) కెమెరామెన్‌గా ఉండగా, ప్రస్తుతం రవి కె. చంద్రన్(Ravi K. Chandran) సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ విషయంలోనూ ఇదే తరహా మార్పు కనిపించింది. హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameswar) స్థానంలో ఇప్పుడు తమన్(thaman) మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇక ఎడిటింగ్ విభాగంలోనూ మార్పు జరిగిందనే ప్రచారం సాగుతోంది. తొలుత శ్రీకర్ ప్రసాద్(Srikar prasad) పేరు వినిపించగా, ప్రస్తుతం నవీన్ నూలి(Naveen Nooli) ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
వరుసగా టెక్నికల్ టీమ్‌లో మార్పులు జరుగుతుండటంతో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే ఈ మార్పుల వెనుక త్రివిక్రమ్‌కు, సంబంధిత టెక్నీషియన్లకు మధ్య విభేదాలున్నాయని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అసలు కారణాలు మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty), నారా రోహిత్(nara rohit), నివేదా పేతురాజ్(nivetha pethuraj) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika and hassinee creations) నిర్మిస్తోంది. సమ్మర్లో రావాల్సిన సినిమా ఇప్పుడు అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.








