మూడు భాషల్లో మూడు దారులు.. దృశ్యం ఫ్రాంచైజీలో ఇదే అసలు ట్విస్ట్!
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో దృశ్యంకు ప్రత్యేక స్థానముంది. మలయాళంలో మోహన్‌లాల్(mohanlal), హిందీలో అజయ్ దేవగణ్(Ajay devgan), తెలుగులో వెంకటేష్(venkatesh తమదైన శైలిలో ఈ కథకు గుర్తింపు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మూడు భాషల్లో ఒకే దారిలో కాకుండా విభిన్న మార్గాల్లో ముందుకు సాగుతోంది. మలయాళ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాలుగో భాగం తెరకెక్కనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. జీతూ జోసెఫ్(jeethu joseph) దర్శకత్వంలో మోహన్‌లాల్(mohanlal) మరోసారి జార్జ్‌కుట్టిగా కనిపించనున్న నేపథ్యంలో తదుపరి కథ ఎలా ఉండబోతుందనే డిస్కషన్ మొదలైంది.
ఇదే సమయంలో హిందీ దృశ్యం సిరీస్ మాత్రం మూడో భాగంతో ముగింపు పలకనుంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దృశ్యం3(Drishyam3)ను ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమాగా మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో హిందీ ప్రేక్షకులకు సక్సెస్ఫుల్ గా ఈ కథ మూడో అధ్యాయంతోనే ముగిసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తెలుగు దృశ్యం ఫ్యూచర్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు. వెంకటేష్(venkatesh) ఈ ఫ్రాంచైజీని కొనసాగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో నాలుగో భాగం సంగతి పక్కన పెడితే, మూడో భాగం తెరకెక్కుతుందా లేదా అన్నదే ప్రశ్నగా మారింది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే దృశ్యం ఫ్రాంచైజీలో మలయాళ వెర్షన్ మాత్రమే మూడో భాగాన్ని దాటి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే జార్జ్‌కుట్టి కథను కొనసాగించే ఏకైక భాషగా మలయాళం నిలవనుంది. ఇతర భాషల రీమేక్‌లు ముగింపు దిశగా వెళ్లడం లేదా అనిశ్చితిలో ఉండటంతో, ఒరిజినల్ కథకు మాత్రమే ప్రత్యేకమైన కొనసాగింపు దక్కే పరిస్థితి ఏర్పడింది.








