కరీనా కెరీర్లో కొత్త ట్రెండ్!
కరీనా కపూర్(kareena kapoor) సినీ కెరీర్ 26 ఏళ్లుగా కొనసాగుతోంది. 45 ఏళ్ల వయసులోనూ ఆమెకు కొత్త తరహా పాత్రలు, కొత్త హీరోలతో కాంబినేషన్లు దక్కుతుండటం ఇంట్రెస్టింగ్గా మారింది. సెప్టెంబర్ 18న రిలీజ్ కానున్న దాయిరా(Dhaira)లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Pridhviraj sukumaran)తో ఆమె తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమాలో ఇద్దరూ పోలీస్ అధికారులుగా కనిపించనున్నారు. గతంలో షారుఖ్(Shahrukh), సల్మాన్(Salman), ఆమిర్(aamir), అక్షయ్(akshay), అజయ్ దేవగణ్(Ajay Devgan), షాహిద్ కపూర్(Shahid Kapoor), సైఫ్ అలీ ఖాన్(Saif ali Khan) వంటి అగ్ర హీరోలతో నటించిన కరీనా.. ఇప్పుడు మరో ఇండస్ట్రీకి చెందిన స్టార్‌తో జతకట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
అంతేకాదు, దాయిరా తర్వాత కూడా కరీనా మరో కొత్త కాంబినేషన్లో కనిపించే అవకాశం ఉందనే డిస్కషన్ జరుగుతోంది. తమిళ స్టార్ ధనుష్(Dhanush), కరీనా ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali) నిర్మాణంలో ఓ హిందీ సినిమా తెరకెక్కించే ఆలోచనపై డైరెక్టర్ పీఎస్ మిత్రన్ స్పందించారు. ప్రస్తుతం నటీనటుల డేట్స్‌పై డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ప్రాజెక్ట్ ఖరారైతే ధనుష్, కరీనా కలయిక కూడా తొలిసారే అవుతుంది.
ఇలా చూస్తే కరీనా కెరీర్లో మారుతున్న ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. జానే జాన్(jaane jaan) తో ఓటీటీకి అడుగుపెట్టడం, క్రూ(crew) లో విభిన్నమైన మహిళా పాత్రను చేయడం, సింగమ్ అగైన్(singam again) లో కమర్షియల్ జోన్లోకి రావడం వంటి ప్రయోగాలు ఆమె ఎంపికల్లో మార్పును చూపించాయి. ఇప్పుడు పృథ్వీరాజ్, ధనుష్ వంటి సౌత్ స్టార్లతో కాంబినేషన్లు కుదురుతుండటం.. బాలీవుడ్, సౌత్ మధ్య పెరుగుతున్న క్రాస్-ఇండస్ట్రీ కాస్టింగ్‌కు మరో ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.








