శంకర్-మురుగదాస్ కాంబినేషన్‌పై ఇంట్రెస్టింగ్ టాక్.. అసలు ప్లాన్ ఏంటి?
కోలీవుడ్‌లో ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పేర్లు ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్‌తో ముడిపడి వినిపిస్తున్నాయి. శంకర్(shnakar), ఏ.ఆర్. మురుగదాస్(AR Murugadoss) కలిసి ఓ కథపై పనిచేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది పూర్తిస్థాయి సినిమా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టా? లేక ప్రారంభ దశలో ఉన్న స్టోరీ డిస్కషన్సా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం శంకర్‌కు చెందిన రైటింగ్ టీమ్ రూపొందించిన ఓ కథపై మురుగదాస్ తన ఇన్పుట్స్ ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య అసలు ఏ స్థాయిలో సహకారం జరుగుతోందన్నది ఆసక్తిని పెంచుతోంది.
శంకర్ సినిమాలు సాధారణంగా భారీ నిర్మాణ విలువలు, కొత్త తరహా విజువల్స్‌తో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల చుట్టూ సాగుతుంటాయి. మురుగదాస్ మాత్రం బలమైన కాన్సెప్ట్‌కు కమర్షియల్ టచ్ జోడించి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి కథా ఆలోచనలకు మరొకరి స్క్రీన్‌ప్లే ట్రీట్మెంట్ కలిస్తే కొత్త తరహా సినిమా పుట్టే అవకాశం ఉందనే డిస్కషన్ మొదలైంది. అయితే ఇందులో శంకర్ పాత్ర రచన వరకేనా, మురుగదాస్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారా, లేక ఇద్దరూ వేరే విధంగా భాగస్వాములు కానున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఇద్దరు డైరెక్టర్ల నుంచి కానీ, వారి టీమ్‌ల నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. అందువల్ల ప్రస్తుతం దీనిని కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తగానే చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ శంకర్, మురుగదాస్ వంటి ఇద్దరు క్రియేటివ్ ఫిల్మ్మేకర్లు ఒకే కథపై ఆలోచనలు పంచుకుంటున్నారనే వార్తే సినీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డిస్కషన్ నిజంగా సినిమా దిశగా అడుగులు వేస్తే మాత్రం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసమే కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది.








