జైలర్ 2 వాయిదా పడితే.. దసరా రేసులోకి ఇద్దరు హీరోలు!
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటిస్తున్న జైలర్2(jailer2) చుట్టూ ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అక్టోబర్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు మరింత టైమ్ అవసరమవుతోందనే ప్రచారం వినిపిస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ నెల్సన్(Nelson) తన సినిమాల ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. దీంతో అనుకున్న టైమ్ కు సినిమా రెడీ అవుతుందా లేదా అన్నదానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు.
జైలర్2లో అనిరుధ్(anirudh) అందించనున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా ఉండటంతో, మ్యూజిక్ విషయంలో ఎలాంటి తొందరపాటు చేయకూడదని టీమ్ భావిస్తున్నట్లు టాక్. అన్ని పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాతే రిలీజ్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోతే సినిమాను దీపావళి కానుకగా తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరో రెండు వారాల్లో రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ జైలర్2 అక్టోబర్ 15 నుంచి తప్పుకుంటే.. ఆ డేట్ కోసం పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ హీరో ధనుష్(dhanush) నటించిన ఓమ్- చాప్టర్1(om chaper1), తెలుగు హీరో నిఖిల్(nikhil) నటించిన స్వయంభు(Swayambhu) సినిమాలు దసరా స్లాట్‌పై కన్నేసినట్లు సమాచారం. నిఖిల్ నటించిన స్వయంభు షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం కావడంతో ఇప్పటివరకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం అక్టోబర్ 15న రిలీజ్ చేసే అంశంపై మేకర్స్ సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ధనుష్ నటించిన ఓమ్- చాప్టర్1 షూటింగ్ కూడా పూర్తయింది. ఏజీకుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దసరా సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది అక్టోబర్ 15 స్లాట్‌ను దక్కించుకుంటుందనేది జైలర్2 డెసిషన్‌పైనే ఆధారపడి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో దసరా రిలీజ్ రేసులో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.








