మ్యూజిక్ ఆర్టిస్ట్‌గా తొలి అడుగు వేసిన హృతిక్ రోషన్ కొడుకు!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(hritik roshan) పెద్ద కొడుకు హ్రెహాన్ రోషన్(Hrehaan roshan) తన కెరీర్‌కు ఊహించని దిశను ఎంచుకున్నాడు. సాధారణంగా స్టార్ హీరోల వారసులు యాక్టింగ్ వైపు అడుగులేస్తారని అభిమానులు భావిస్తుంటారు. అయితే హ్రెహాన్ మాత్రం ఆ దారికి భిన్నంగా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. తన తొలి సింగిల్ దిస్ హెవెన్లీ ప్లేస్(this heavenly place) తో ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. శుక్రవారం రిలీజైన ఈ సాంగ్‌తో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
ఈ సాంగ్ విషయంలో హ్రెహాన్ ఒక్క బాధ్యతకే పరిమితం కాలేదు. సింగర్‌గా, సాంగ్ రైటర్ గా, గిటారిస్ట్‌గా తన టాలెంట్ ను ఒకే ప్రాజెక్ట్‌లో చూపించాడు. ముఖ్యంగా సాంగ్ కు సంబంధించిన వీడియోను చాలా సింపుల్‌గా రూపొందించడం ఆసక్తిని పెంచుతోంది. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్‌లో హ్రెహాన్ స్వయంగా గిటార్ వాయిస్తూ సాంగ్ ను పాటడటం కనిపిస్తుంది. ఎలాంటి హంగామా, భారీ సెట్స్ లేకుండా పూర్తిగా మ్యూజిక్, పెర్ఫార్మెన్స్‌పైనే దృష్టి పెట్టేలా వీడియోను రూపొందించారు.
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన తొలి ప్రయత్నాన్ని ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రారంభించాలనే హ్రెహాన్ ఆలోచన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతని డెబ్యూ సాంగ్ కు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటూ ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా హ్రెహాన్ ఎంచుకున్న మార్గం రోషన్ ఫ్యామిలీలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్టుగా కనిపిస్తోంది. ఫ్యూచర్ లో మ్యూజిక్ ఇండస్ట్రీలోనే అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడా, లేక సినిమాల్లో మరో రూపంలో కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.








