వెంకీ- అనిల్ సినిమాకు అదిరిపోయే డీల్
టాలీవుడ్లో కాంబినేషన్ రిపీట్ అవుతున్న ప్రతీసారి అంచనాలు ఎలా పెరుగుతాయో, అదే తరహాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)- హీరో వెంకటేష్(Venkatesh) జోడీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే F2, F3 వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబో, ఇప్పుడు ఐదోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. జూన్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ ఇటీవల చిరంజీవి(chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు(Mana shankaravaraprasad garu) సినిమాలో క్యామియో లో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జీ స్టూడియోస్(Zee Studios) ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడంతో పాటు నాన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. సంగీత హక్కులు మినహా మిగతా నాన్-థియేట్రికల్ రైట్స్ వాల్యూ సుమారు రూ.70 కోట్లు అని సమాచారం. వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమాల రేంజ్‌ను దాటేలా ఈ డీల్ ఉండటం విశేషంగా మారింది. సాధారణంగా లో బడ్జెట్, సేఫ్ డీల్స్‌తో ముందుకెళ్లే ఈ కాంబోకి ఇది సెన్సేషనల్ బిజినెస్ డీల్‌గా భావిస్తున్నారు.
కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ఆసక్తిని పెంచుతోంది. ఈ ఎంటర్టైనర్లో మరో ముఖ్య పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్(nandamuri kalyanram) నటిస్తుండగా, వెంకటేష్‌కు జోడిగా కీర్తి సురేష్(Keerthy suresh), కళ్యాణ్ రామ్‌కు జోడిగా కృతీ శెట్టి(Krithi shetty) కనిపించనున్నారు. సాహు గారపాటి(Sahu garapati) నిర్మాణంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్(Shine screens banner)పై తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఫైనల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా, ఈ సినిమాను సంక్రాంతి 2027 సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.








