“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి హీరోయిన్ అయేషా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సుధీర్స్ జోకర్”. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. “సుధీర్స్ జోకర్” చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో తన అందంతో పాటు పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్ గా హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన “సుధీర్స్ జోకర్” మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే ఎక్స్ పెక్టేషన్స్ ఈ మూవీపై ఏర్పడుతున్నాయి.








