Nag100: లాటరీ కింగ్ లో ఐశ్వర్యా?
అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ సినిమా లాటరీ కింగ్(lottery king) పై తాజాగా ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్(Aishwarya rajesh) ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. యాక్షన్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు(Tabu) కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. స్టార్ కాస్టింగ్‌తోనే ఈ సినిమా ప్రారంభ దశలోనే మంచి హైప్ సంపాదించుకుంది.
గతేడాది వెంకటేష్(Venkatesh) సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు నాగార్జునతో జోడీ కట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ కొత్త కాంబినేషన్ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తీసుకువస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా యాక్టింగ్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ రా కార్తీక్(ra. karthik)ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒక యంగ్ డైరెక్టర్ పై నాగార్జున ఉంచిన నమ్మకం ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది.
లాటరీ కింగ్ లో నాగార్జునను అత్యంత స్టైలిష్ అవతారంలో చూపించనున్నారని సమాచారం. ఆయన గత హిట్ సినిమాలైన శివ(siva), రక్షకుడు(rakshakudu), కూలీ(Coolie) తరహా గెటప్పులకు స్ఫూర్తిగా పలు వేరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. కథలో ఎమోషన్, యాక్షన్ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉండనుండగా, టబు పాత్ర సినిమాకు మరింత బలాన్ని తీసుకురానుందని భావిస్తున్నారు. మొత్తం మీద, నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ 100వ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








