Akkineni Fans: అక్కినేని సోగ్గాళ్లు మళ్లీ వస్తున్నారు
అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) ప్రస్తుతం తన కెరీర్లో డిఫరెంట్ ఫేజ్ లో ఉన్నారు. నా సామిరంగ (Naa samiranga) తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టడానికి ఆయన చాలా టైమ్ తీసుకున్నారు. దానికి కారణం అది ఆయన 100వ సినిమా కావడమే. 100వ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ గొప్పగా ఉండాలని నాగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ లోగా వేరే హీరోల సినిమాల్లో నాగ్ కనిపించారు.
కుబేర(kubera) మూవీలో దీపక్ అనే సపోర్టింగ్ రోల్ చేసి మెప్పించిన నాగ్, కూలీ(Coolie) మూవీలో సైమన్ అనే విలన్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలతో నాగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ్ కెరీర్లో స్పెషల్ గా నిలిచిన సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయన(Soggade chinni nayana) కూడా ఒకటి. కళ్యాణ్ కృష్ణ(kalyan krishna) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా నాగ్(Nag) ను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది.
ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు(bangarraju) కూడా మంచి హిట్ గా నిలిచింది. అయితే బంగార్రాజు తర్వాత మరో సినిమా ఉంటుందని మేకర్స్ అప్పట్లో చెప్పినప్పటికీ తర్వాత మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios) ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ అప్డేట్ ను ఇచ్చింది. సోగ్గాళ్లు మళ్లీ వస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 15న అక్కినేని సోగ్గాళ్లు రానున్నట్టు వెల్లడిస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.
https://x.com/AnnapurnaStdios/status/2020446357954183226?s=20













