Suryakumar Yadav: ఈ కప్పు మనందరిదీ.. టార్గెట్ ఒలింపిక్ గోల్డ్ లక్ష్యం: సూర్యకుమార్
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చారిత్రక సాఫల్యం నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు ఒక భావోద్వేగ భరితమైన సందేశాన్ని పంపాడు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను బీసీసీఐ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
గెలుపు ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ సూర్య (Suryakumar Yadav) కృతజ్ఞతలు తెలిపాడు. “ప్రియమైన టీమిండియా అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అచంచలమైన మద్దతు, ఆశీస్సుల వల్లే మేం ఈ రోజు ఈ అత్యున్నత శిఖరంపై నిలబడ్డాం. ఈ వరల్డ్ కప్ ట్రోఫీ కేవలం మైదానంలో ఆడిన ఆటగాళ్లది మాత్రమే కాదు, మొత్తం దేశానిది. చేతిలో బ్యాట్, బంతి పట్టుకుని భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే ప్రతి చిన్నారిది. స్టేడియాలకు తరలివచ్చి ఉత్సాహపరిచిన అభిమానులది, ఇంటి నుంచి టీవీల ముందు కూర్చుని ప్రార్థించిన లక్షలాది మందిది. మీ ప్రేమే ప్రతి మ్యాచ్‌లోనూ మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. మన దేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అదొక ఎమోషన్. ఈ ఘనవిజయం మనందరిది” అని సూర్యకుమార్ (Suryakumar Yadav) ఉద్వేగంగా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇదే సమయంలో భవిష్యత్ లక్ష్యాలపై కూడా ‘స్కై’ స్పష్టత ఇచ్చాడు. ఈ విజయంతో ఆగిపోకుండా, భారత జట్టు తదుపరి ప్రధాన లక్ష్యం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడమేనని తేల్చి చెప్పాడు. అలాగే అదే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను సైతం కైవసం చేసుకోవడమే తమ ముందున్న టార్గెట్ అని చెప్పాడు. ఈ అద్భుత ప్రపంచకప్ విజయంతో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్థాయి భారత క్రికెట్లో అమాంతం పెరిగింది. క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మల తర్వాత ఐసీసీ టైటిల్ అందించిన భారత కెప్టెన్ల ఎలైట్ జాబితాలో సూర్యకుమార్ సగర్వంగా చోటు దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి








