చిన్నస్వామిలో ఆర్సీబీ బ్యాటింగ్ vs లక్నో బౌలింగ్..!
ఐపీఎల్ 2026(IPL 2026) లో ఈరోజు ఒక ఆసక్తికరమైన పోరుకు చిన్నస్వామి స్టేడియం వేదిక కాబోతోంది. ఈ సీజన్లోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్ కలిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడనుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు.. ‘బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్’ మధ్య జరుగుతున్న మహా సంగ్రామంగా అభివర్ణిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ సీజన్లో ఆర్సీబీ టాప్-6 బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పడుతున్నాయి.
గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆర్సీబీ టాప్-6 బ్యాటర్ల రన్ రేట్ 11.1. ఇది ఈ లీగ్‌లోనే టాప్. వీరి సగటు 45.2 కాగా, ప్రతి 3.6 బంతులకు ఒక బౌండరీ బాదుతున్నారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 200 ప్లస్ స్కోర్లు సాధించి రికార్డు సృష్టించారు. ఈ రోజు కూడా 200 దాటితే, ఐపీఎల్లో వరుసగా 5 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. లక్నో బౌలింగ్ విషయానికి వస్తే.. వీళ్ళు.. పరుగుల కట్టడిలో మొనగాళ్లు.
ఆర్సీబీ బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో.. లక్నో బౌలింగ్ అంత పకడ్బందీగా ఉంది. ఈ సీజన్లో 200 ప్లస్ స్కోర్లు సర్వసాధారణం అయిపోయిన తరుణంలో.. లక్నో బౌలర్లు మాత్రం ఒక్కసారి కూడా 200 రన్స్ ఇవ్వలేదు. లక్నో బౌలింగ్ ఎకానమీ 8.5 మాత్రమే. ఇదే లీగ్‌లో అందరికంటే బెస్ట్. ఆర్సీబీ బౌలింగ్ ఎకానమీ 10.62తో 8వ స్థానంలో ఉండగా.. లక్నో మాత్రం టాప్ లో ఉంది. బ్యాటింగ్‌లో లక్నో టాప్-6 చాలా వెనుకబడి ఉంది. వారి రన్ రేట్ కేవలం 7.6 మాత్రమే. ప్రతి 5.6 బంతులకు ఒక బౌండరీ మాత్రమే కొట్టగలుగుతున్నారు. వారి అత్యధిక స్కోరు కూడా కేవలం 182 మాత్రమే. అంటే, లక్నో బ్యాటర్లు తడబడితే.. ఆ భారాన్ని బౌలర్లు మోస్తున్నారు.
ఇవి కూడా చదవండి








