రాహుల్ వర్సెస్ కోహ్లీ, ఢిల్లీ వేదికగా కీలక పోరు..!
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నేడు జరగబోయే 39వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు ఊపందుకున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ గణాంకాలను పరిశీలిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ దిశగా బలంగా దూసుకుపోతోంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీకి, తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు అత్యంత కీలకం కానుంది. ఈ 2026 సీజన్లోనే వీరిద్దరి మధ్య జరిగిన గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఆ ఉత్కంఠ పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని, తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తుండగా.. సొంత గడ్డపై మరోసారి విజయం సాధించి పాయింట్ల వేటను కొనసాగించాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. ఈ సీజన్ పాయింట్ల వేటలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారనుంది. ఢిల్లీ స్టార్ ఆటగాడు రాహుల్(KL Rahul), ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ(Virat Kohli) సూపర్ ఫాంలో ఉండటంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి





