Gambhir: అర్ష్‌దీప్ దూకుడు తప్పేం కాదు.. ఇది షేర్ మార్కెట్ కాదు: గంభీర్
టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరంలో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై ఐసీసీ (ICC) జరిమానా విధించడం, నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gambhir) తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. జట్టు ఆటగాడి దూకుడును బహిరంగంగా సమర్థిస్తూనే, తన వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఆ కసి ఉండాల్సిందే!
ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ చేతిలో వరుసగా రెండు సిక్సర్లు సమర్పించుకున్న అసహనంతో అర్ష్‌దీప్.. తర్వాతి బంతిని నేరుగా మిచెల్ వైపు విసరడం ఉద్రిక్తతకు దారితీసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ (Arshdeep Singh) క్షమాపణలు చెప్పినప్పటికీ, ఐసీసీ అతనికి 15 శాతం జరిమానా విధించింది. దీనిపై ఓ జాతీయ ఛానల్‌తో గంభీర్ (Gambhir) మాట్లాడుతూ.. అర్ష్‌దీప్ తీరును వెనకేసుకొచ్చాడు.
“అదొక పెద్ద సమస్యే కాదు. దేశం తరఫున ఆడేటప్పుడు ఆ మాత్రం దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఏ బౌలర్ కూడా వరుసగా సిక్సర్లు కొట్టించుకోవాలని కోరుకోడు. నా ఆటగాళ్ల నుంచి నేను ఆశించేది కూడా ఇలాంటి పోరాటపటిమనే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ అర్ష్‌దీప్ సారీ చెప్పకపోయినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ చెప్పి మంచి పనే చేశాడు. మైదానంలోకి దిగాక ఎవరూ మిత్రులు, శత్రువులు కారు. సోషల్ మీడియా ప్రతి చిన్న విషయాన్నీ తప్పుబట్టడమే పనిగా పెట్టుకుంది” అని గంభీర్ (Gambhir) కుండబద్దలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అందుకే నేను డగౌట్లో నవ్వను..
ఎప్పుడూ డగౌట్లో సీరియస్‌గా ఉంటారంటూ తనపై వచ్చే సోషల్ మీడియా ట్రోల్స్‌కు సైతం గంభీర్ (Gambhir) దీటుగా బదులిచ్చాడు. “భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం ఎంత బాధ్యతాయుతమైన పనో విమర్శించేవారికి తెలియదు. ఇక్కడ ఓటమి అనేది ఆప్షన్ కాకూడదు. ఎప్పుడూ గెలవాలనే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి కఠిన పరిస్థితుల్లో నేను డగౌట్లో కూర్చుని నవ్వుతూ ఎలా ఉండగలను?” అని సూటిగా ప్రశ్నించాడు.
“ప్రతి ప్రపంచకప్ మనమే గెలవాలని అభిమానులు కోరుకుంటారు. కానీ క్రీడల్లో అది ఎప్పుడూ సాధ్యం కాదు. మన జీవితమంతా కష్టపడినా ఎప్పుడూ సత్ఫలితాలే వస్తాయని గ్యారంటీ లేదు. ఇదొక క్రీడ.. కచ్చితమైన లాభాలు ఇచ్చే షేర్ మార్కెట్ కాదు” అని గంభీర్ (Gambhir) తన ఫిలాసఫీని వివరించాడు.
ఇవి కూడా చదవండి








