అన్నమయ్యపురంలో “పంచాంగ శ్రవణం” మరియు తొలిసారిగా “దశావధానం”
అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపక అధ్యక్షులు డా. శోభా రాజు గారి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శిష్యులు శ్రీ రామ్ “కొండలలో నెలకొన్న” అన్నమయ్య కీర్తనతో ప్రారంభించారు.
అనంతరం శ్రీ పెద్దింటి వెంకట భాస్కర సత్యనారాయణాచార్యులు గారిచే పంచాంగ శ్రవణం గంటసేపు చేశారు. అన్ని రాశుల వారి రాశి ఫలాలను, విచ్చేసిన వారందరికీ అర్థమయ్యే రీతిలో తెలిపారు.
శోభా రాజు గారు మాట్లాడుతూ అన్ని రాశుల వారు ఒక్క దైవచింతన కలిగి ఉంటే అంతా మంచే జరుగుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
తొలిసారిగా దశావధాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీ సురభి శంకర శర్మ గారిచే రెండు గంటల పాటు రసవత్తరంగా దశావధానం సాగింది. వివిధ అంశాలపై ప్రుచ్ఛకులు వేసిన చిక్కటి సమస్యలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వివరించారు.

చివరిగా పంచాంగ శ్రవణం చేసిన పండితులకు సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు గారు, మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు సంస్థ జ్ఞాపికను ఇచ్చి గౌరవించారు.
శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి మరియు విచ్చేసిన వారందరికీ చక్కటి సాంప్రదాయ పద్ధతిలో భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి








