సీఎం కేసీఆర్ కు ప్రధాని ఫోన్
ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు టీఆర్ఎస్ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. కోవింద్‌ను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీ, సీఎంకు ఫోన్ చేసి మద్దతు కోరారు. మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం. మీ సహకారం కావాలి అని ప్రధాని కోరినట్లు తెలిసింది. వెంటనే కేసీఆర్ టీఆర్ఎస్ సీనియర్ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఓ దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.








