చీరకట్టులో చూడముచ్చటగా అనుపమ
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్ ను అలరిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే అనుపమ తాజాగా చీరకట్టులో మెరిసింది.


ఇవి కూడా చదవండి
ఈ ఫోటోల్లో అమ్మడు డ్యూయల్ టోన్ ఎమరాల్డ్ గ్రీన్ శారీని ధరించి దానికి మ్యాచింగ్ గా క్లోజ్ నెక్ బ్లౌజ్ ధరించి మెడలో గోల్డ్ చోకర్, చేతికి మ్యాచింగ్ గా గోల్డ్ మరియు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ధరించి నుదుటన బొట్టు పెట్టుకుని ఎంతో సహజంగా మెరవగా, నెటిజన్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేయడంలో బిజీ అయ్యారు.










