చెన్నూరులో శ్రీ కోదండరామ భజనమందిరం నిర్మాణానికి పెదన ఎమ్మెల్యేకు వినతి
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామంలో ప్రతిపాదిత శ్రీ కోదండరామ భజన మందిర నిర్మాణానికి తోడ్పడాల్సిందిగా పెదన ఎమ్మెల్యే కవితా కృష్ణ ప్రసాద్ ను ‘తెలుగు టైమ్స’ (అమెరికా) ఎడిటర్ అండ్ సీఈఓ, శ్రీ కోదండరామ ట్రస్ట్ (చెన్నూరు) అధ్యక్షుడు శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా భజన మందిర నిర్మాణ ప్రతిపాదనలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనవంతుగా సహాయ సహకారాలను అందిస్తానని హామి ఇచ్చారు. ఈ భజనమందిర నిర్మాణానికి దాతలు, శ్రేయోభిలాషులు ఉదారంగా విరాళాలు అందించి నిర్మాణానికి తోడ్పడాలని శ్రీ సుబ్బారావు ఒక ప్రకటనలో కోరారు. విరాళాలు, ఇతర వివరాలకోసం తనను సంప్రదించవచ్చని చెప్పారు.
ఫోన్ నంబర్ (91) 98495 99625,
ఈమెయిల్ [email protected]








