ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ తూట చంద్ర ధన శేఖర్ (Thuta Chandra Dhana Sekhar), డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) వీరిచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ఐదుగురిని సీజేతో పాటు పలువురు న్యాయమూర్తులు (Judges), న్యాయ వాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది అభినందించారు.








