శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం
అమరావతి: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం చేశారు. దేవాలయ అధికారులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను అందించారు. మంత్రి లోకేష్ ను కలిసి ఆహ్వానం పలికిన వారిలో ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.








