శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్, మహాయాన బ్యానర్స్ “అట్టహాసం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్
“క” వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మహాయాన బ్యానర్ తో కలిసి “కేరాఫ్ కంచెరపాలెం” వంటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “అట్టహాసం”. ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మిస్తున్నారు. చింతా వినీషా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. “అట్టహాసం” చిత్రంలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రోజు “అట్టహాసం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రెండు జంటలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక జంటకు ‘మాకు మోక్షం కావాలి…’ అని, మరొక జంటకు ‘మాకు ఉద్యోగం కావాలి..’ అని క్యాప్షన్స్ రాయడం ఆసక్తి కలిగిస్తోంది. రియల్, రూటెడ్, ఆంథెటిక్ ఎంటర్ టైనర్ గా “అట్టహాసం” సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు.








