అందుకే ఆ సమావేశానికి వెళ్లడం మానేశా : జగ్గారెడ్డి
రాజకీయంగా నా మనసులో ఓ కోరిక ఉంది. దాన్ని సాధించేందుకు అవసరమైన కార్యాచరణ సైతం ఉంది. అదేంటో నవంబరులో కార్యకర్తల సమక్షంలో వెల్లడిస్తా. ఈ ముడు నెలల్లో రాజకీయంగా చేపట్టాల్సిన బాధ్యతలపై స్పష్టత వస్తుంది అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (Jaggareddy) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) కేంద్రంలో నియోజకవర్గస్థాయి బీఎలఏలు, నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈమధ్య పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో మాట్లాడిన అంతర్గత విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకే ఆ సమావేశానికి వెళ్లడం మానేశా. పార్టీ అంతర్గత విషయాలు, నాయకుల (leaders) మధ్య గొడవలు, ఇతరత్రా విధానపరమైన తప్పిదాలు ఉంటే నేరుగా ఢిల్లీ (Delhi)కి వచ్చి తనతోనే మాట్లాడాలని రాహుల్ (Rahul) నా నుంచి మాట తీసుకున్నారు అని తెలిపారు.








