వైఎస్ జగన్ పర్యటనలో… వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విశాఖపట్నం పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ( YCP workers) అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ నేతల జనసమీకరణతో ఎయిర్పోర్టు ( Airport)కు భారీగా చేరుకున్న కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్కు అనుకూలంగా నివాదాలు చేశారు. ఒక దశలో ఎయిర్పోర్టు లోపలికి వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫ్ జామ్ అయింది. విమాననగరం వైపు నుంచి షీలానగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.
అంపోలు జైల్లో రిమాండ్ లో ఉన్న సీదిరి అప్పలరాజు (Seediri Appalaju)తో ములాఖత్ అయ్యేందుకు జగన్ బయల్దేరారు. ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు (police) ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నిబంధనల్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీసుల ఆంక్షలు లేక్కచేయకుండా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.








