ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు నమోదైన తర్వాత విదేశాలకు పరారైన ఏ 10 నిందితుడు సైఫ్ అహ్మద్ ( Saif Ahmed) విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో లొంగిపోయేందుకు అనుమతివ్వాలని పిటిషన్లో కోరారు. రాజ్కెసిరెడ్డి (Raj KC Reddy) ప్రధాన అనుచరుల్లో సైఫ్ అహ్మద్ ఒకరు. లిక్కర్ స్కామ్ (Liquor scam) నగదు లావాదేవీల్లో అతను కీలకంగా ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో లొంగిపోతానంటూ సైఫ్ పిటిషన్ వేయడం కీలకంగా మారింది.








