అలాంటి వ్యక్తిని పరామర్శించి ఏం సందేశం ఇస్తారు? : చంద్రబాబు
రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య (Danayya) మరణానికి కారణమైన తన కుమారుణ్ని కాపాడుకోవడానికి ఓ నిరపరాధిని బలి చేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) చూశారు. సచివాలయంలో పలువురు నేతలతో సీఎం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ ఇందుకోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వెళుతూ గొడ్డలి పార్టీ అధినేత సమాజానికి ఏం సందేశం ఇస్తారు? ఇది ముమ్మాటికి నేర సంస్కృతిని ప్రోత్సహించడమే. మృతుడి కుటుంబం పడుతున్న బాధ ఆయనకు పట్టదా? కనీసం వారిని పరామర్శించాలని కూడా అనుకోకపోవడం జగన్ (Jagan) క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనం. హత్యలు చేసే ప్రతి ఒక్కరూ జగన్కు పిల్లలుగానే కనబడతారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి( Avinash Reddy), సీదిరి ఆవర్ ఇద్దరూ పసిపిల్లలే అని విరుచుకుపడ్డారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని నేరస్థులను పరామర్శించడమే జగన్ పనిగా మారిందని దుయ్యబట్టారు. వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.








