యూఎస్ స్కాలర్ అవార్డుకు కిలారు అరుణ ఎంపిక
అమెరికా ప్రభుత్వం అందించే ఫుల్ బ్రైట్ యూఎస్ స్కాలర్ అవార్డుకు ఏలూరుకు చెందిన కిలారు అరుణ (Kilaru Aruna) ఎంపికయ్యారు. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమం కింద అమెరికాలోని ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు (Professor), పరిశోధకులు, నిపుణులను ఎంపిక చేసి ఇతర దేశాల్లోని అగ్రగామి పరిశోధనా సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తారు. అరుణ ప్రస్తుతం ఈస్ట్ టెనసీ స్టేట్ యూనివర్సిటీ ( East Tennessee State University)లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భారత్ -అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఫుల్ బ్రైట్ నెహ్రూ అకడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ ప్రోగ్రామ్ కింద ఆమె ఎంపికయ్యారు. ఇందులో భాగంగా చండీగఢ్ ( Chandigarh)లోని నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఏబీఐ)లో ఆమె పనిచేయనున్నారు. ఈ అవార్డు (Award)కు ఎంపిక కావడం పై అరుణ సంతోషం వ్యక్తం చేశారు.








