మాజీ మంత్రి కారుమూరికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కారుమూరి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు (High Court) ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కారుమూరి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు.ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం మద్యం స్కామ్‌లో రూ.350 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే కస్టోడియల్ విచారణ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.








