సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుకు సీఐ నాగరాజు
సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి ఆదేశాలతో గాదే సాయి కృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం కేసులో నిందితుడు మాజీ సీఐ నాగరాజు ( Nagaraju) ను విజయవాడ కోర్టు (Vijayawada Court)లో ప్రవేశపెట్టారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram) కేంద్రం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజును కారాగారం నుంచి కస్టడీకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి సెలవుతో ఉండడంతో, ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం కస్టడీకి తీసుకోన్నారు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో నాగరాజు ఏ1గా ఉన్న విషయం తెలిసిందే.








