కేటీఆర్‌కు గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆహ్వానం..!
దుబాయ్‌లో అక్టోబర్ 11న నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు గల్ఫ్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది.
ఈ సందర్భంగా మహేష్ బిగాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగను గల్ఫ్ దేశాల్లోని వివిధ తెలంగాణ సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయని మహేష్ బిగాల తెలిపారు.
అక్టోబర్ 11న దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు, ఆ తర్వాత ETCA ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు వేడుకలు జరగనున్నాయని, ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొని కేటీఆర్‌ను కలిశారు.








