బాలయ్య కోసం కొరటాల కొత్త ప్రపంచం!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)- కొరటాల శివ(koratala siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక మూవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు కారణమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన పుకార్లకు ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇవ్వగా, సినిమా ఖచ్చితంగా పట్టాలెక్కుతుందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను వేగంగా పూర్తి చేస్తున్న కొరటాల శివ, బాలయ్య(balayya) తిరిగి షూటింగ్‌కు సిద్ధమయ్యే సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
కొరటాల శివ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేది ఆయన కథల నేపథ్యమే. హీరో ఎలివేషన్‌తో పాటు ఒక ప్రాంతం, అక్కడి జీవన విధానం, సామాజిక పరిస్థితులను కథలో భాగంగా మలచడం ఆయన శైలిగా మారింది. ఇప్పుడు బాలయ్య కోసం సిద్ధం చేసిన కథలో కూడా అదే తరహా స్ట్రాంగ్ వరల్డ్ ఉండబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా కథలో కీలక స్థానం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవర(Devara) తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. బాలయ్య స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, కానీ గత సినిమాలకు భిన్నమైన ట్రీట్మెంట్తో కథను రెడీ చేసినట్లు టాక్. సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(sudhakar mikkilineni) నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం కథా వివరాలను రహస్యంగా ఉంచుతున్న టీమ్, షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.








