మహేష్ నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్
సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) తర్వాతి సినిమాలపై టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi) తర్వాత మహేష్ ఎలాంటి కథను ఎంచుకుంటారన్నది ఫ్యాన్స్ లో ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో మరోసారి మహేష్ జతకట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల సక్సెస్‌ల కారణంగా ఈ వార్తకు మరింత ప్రాధాన్యం దక్కింది.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని అనిల్ రావిపూడి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఈ కాంబినేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన రెడీ చేస్తున్న కొత్త కథల గురించి కూడా ఇండస్ట్రీలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ కోసం స్పెషల్ గా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నారనే టాక్ మళ్లీ తెరపైకి వచ్చింది.
వారణాసి వంటి భారీ స్థాయి సినిమా తర్వాత మహేష్ బాబు ఆడియన్స్ కు రీఫ్రెషింగ్‌గా అనిపించే కమర్షియల్ ఎంటర్టైనర్ను ఎంచుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అనిల్ రావిపూడి పేరు ఈ డిస్కషన్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. హీరోయిన్గా మమిత బైజు(mamitha baiju) పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ప్రస్తుతం రూమర్‌గా ఉన్న ఈ కాంబినేషన్ ఫ్యూచర్ లో నిజంగా తెరపైకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.








